మార్కాపురం: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి 20 ఎకరాలు భూమిని కేటాయిస్తూ సీఎం చంద్రబాబు ఆమోదం
మార్కాపురం జిల్లా అభివృద్ధిలో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్యాబినెట్లో జిల్లా కలెక్టర్ భవన సముదాలకు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోగులదిన్నె ఇలాకాలోని ఎనిమిది సర్వే నెంబర్లలో ఉన్న భూమిని కేటాయించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సీఎం కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.