రాయదుర్గం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై కళ్యం గ్రామంలో విజయోత్సవ సభ
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డి.హిరేహాల్ మండలంలోని కళ్యం గ్రామంలో టిడిపి నేతలు విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు కు గ్రామస్తులు గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో కూటమి నేతలు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని చెప్పారు. కూటమి కి పట్టం కడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ఇచ్చిన తీర్పు అని గుర్తు రెండేళ్ల నాటి పరిస్థితి గురించి వివరించారు.