రాయదుర్గం: మైలాపురంలో గాలివాన భీభత్సం, గోడకూలి గొర్రెల కాపరి మృతి
బొమ్మనహాల్ మండలంలోని మైలాపురం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలికి రైస్ మిల్లు గోడకూలి హరిజన వెంకటేష్ అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. 20 గొర్రెలు కూడా మృతి చెందాయి. మరో గొర్రె వల కాపరి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాలివాన రావడంతో గొర్రెలతో పాటు వెళ్లి రైస్ మిల్లు పక్కన నిలబడి ఉండగా రైస్ మిల్లు గోడ కూలి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.