రాయదుర్గం: ఆదిగానిపల్లి లో విషాదం, అగ్నిగుండంలో పడి గాయాలపాలైన యువకుడు
కణేకల్లు మండలంలోని ఆదిగానిపల్లి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పీర్ల ఊరేగింపులో అగ్నిగుండ ప్రవేశం చేస్తుండగా పురుషోత్తం అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి అగ్నిగుండంలో పడిపోయాడు. అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే అతన్ని బయటకు తీసి, హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. పండుగ సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.