యర్రగొండపాలెం: చిన్న గుడిపాడు గ్రామంలో కోటి 32 లక్షల రూపాయలతో సోలార్ కనెక్షన్లను ప్రారంభించిన మంత్రి రవికుమార్
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో పీఎం సూర్యగ్రహ పథకం ద్వారా సుమారు కోటి 32 లక్షల రూపాయల తోటి 63 మంది లబ్ధిదారులకు ఉచిత సోలార్ కనెక్షన్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భరించలేని పేదల కోసం బృహత్కర పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.