కళ్యాణదుర్గం: కదరంపల్లి లో బోరు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కుందుర్పి మండలం కదిరంపల్లి గ్రామంలో బుధవారం తాగునీటి సమస్య పరిష్కారమైంది. కదరంపల్లిలో గత కొంతకాలంగా తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈనెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు కదరంపల్లి వెళ్లారు. ఆ సమయంలో గ్రామస్తులు తాగునీటి సమస్య ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సమ్మర్ యాక్షన్ ప్లాన్ టీం సభ్యుల పర్యవేక్షణలో బోరు ఏర్పాటు చేయించారు. సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. తాగునీటి సమస్య పరిష్కారమైంది. గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.