మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వైసిపి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.