రాయదుర్గం: మలేరియా లేని సమాజమ సాద్యమే : పట్టణంలో అవగాహన సదస్సులో వైద్యాధికారులు
మలేరియా లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాయదుర్గం అర్బన్ పిహెచ్సి వైద్యాధికారి డా.యశ్వంత్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ తెలిపారు. మలేరియా అంతం ఇప్పుడు మనకు సాధ్యమే అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలోని 14 వ సచివాలయం మారెమ్మగుడి ఏరియాలో మలేరియా జ్వర లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. ఏరకమైన జ్వరం వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలనీ, మలేరియా అని తేలితే, జ్వరం తగ్గినప్పటికీ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలని సూచించారు.