గిద్దలూరు: కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామంలో భార్యను గొడ్డలితో దాడి చేసి హతమార్చిన భర్త, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వేరెడ్డి పల్లి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బహిర్ భూమికి వెళ్లిన మరియ జ్యోతిపై ఆమె భర్త దావీదు గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హత్య చేసిన తర్వాత పరారైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.