రాయదుర్గం: ఉపాధిహామీ ద్వారా మొక్కలు నాటి నిండా మునిగిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు
పండ్ల మొక్కల సాగు ప్రోత్సాహం లో బాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా అందజేసిన దానిమ్మ మొక్కలు నాటిన ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. గుమ్మగట్ట మండలంలోని ఆర్. కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు రెండేళ్లుగా సుమారు 800 దానిమ్మ మొక్కలు పెంచి పెద్ద చేశాడు. 18 నెలల్లోనే కాయలు కాయాల్సిన చెట్లు 25 నెలలైనా ఒక్కపిందె కుడా కాయలేదు. దీంతో ఆ రైతు ఇన్ని రోజులు పెట్టిన పెట్టుబడి మెత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుదోచక ఆ రైతు లబోదిబో ఏమంటున్నాడు. హార్టికల్చర్, డ్వామా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.