మార్కాపురం: జిల్లా కేంద్రంలో కృష్ణా జలాలతో నిండుకుండ లాగా మారిన గొట్టిపడియ డ్యాం
మార్కాపురం మండలం గొట్టిపాడియా డ్యామ్ కృష్ణా జలాలతో నిండుకుండలా మారింది. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి కృష్ణా జలాలను నల్లమల్లసాగర్ విడుదల చేసిన విషయం తెలిసినదే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు గొట్టిపాడియా డ్యామ్ కు సుమారు 77 అడుగులకు కృష్ణ జలాలు చేరుకున్నాయి. దీంతో నల్లమల్ల కొండల మధ్య అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.