గిద్దలూరు: సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా విమర్శలు గుప్పించిన గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి
సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వసితులకు రూ. 300 కోట్లు ఇచ్చి.. తానే ప్రాజెక్టు ప్రారంభించాను.. తానే పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరు పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున రెడ్డి మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని అత్యధికంగా 60 శాతానికి పైగా ప్రాజెక్టు పనులు జరిగాయని తర్వాత పనులను అత్యధికంగా పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు.