దర్శి: గుంటి గంగమ్మ తిరునాళ్ల వైసిపి ప్రభ పై పాల్గొన్న జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరపాడు గుంటి గంగమ్మ తిరుణాల సందర్భంగా శివరాంపురం వైసిపి విద్యుత్ ప్రభ ఫై జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాంపురంలో 2024 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఇచ్చారన్నారు. గ్రామంలో టిడిపి ఆధిక్యత ఉన్న ప్రజల చరిత్రను తారుమారు చేశారని ఉత్సాహపరిచారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.