కొండపి: సింగరాయకొండ మండలం పాకాల లో నాలుగు జిల్లాలకు చెందిన మత్స్యకారుల సమావేశం, అక్రమ చొరబట్లపై చర్చ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో నాలుగు జిల్లాలకు చెందిన మత్స్యకారులు సోమవారం ఏప్రిల్ 5వ తేదీన సమావేశం కానున్నారు. తమిళనాడుకు చెందిన జాలర్లు తమ ప్రాంతంలోకి ప్రవేశించి తమ బాలలకు పడవలకు నష్టం చేకూరుస్తున్నారని జాలర్లు సమావేశం కానున్నారు. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు చెందిన జాలర్లు ఈ సమావేశంలో హాజరుకానున్నారు. అక్రమ చొర బాట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మత్స్యకారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.