గిద్దలూరు: బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలో రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ దానమయ్య అనే వ్యక్తి సంఘటనా స్థలంలోని మృతి చెందాడు. మరో లారీలో లారీ నడుపుతున్న సుధాకర్ అనే లారీ డ్రైవర్ క్లీనర్ మనోహర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.