రాయదుర్గం: కణేకల్లు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపి, ఎమ్మెల్యే
రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం, సొల్లాపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం నియోజకవర్గంలో “ప్రగతి పండుగలు” పేరుతో 10 రోజులపాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు శనివారం ఎన్.హనుమాపురం గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన త్రాగునీటి పైపు లైన్‌ను, సొల్లాపురంలో 38 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి పైప్ లైన్ ప్రారంభించి, కొళాయిలకు నీటిని విడుదల చేశారు.