రాయదుర్గం: పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు పట్టణంలోని దశభుజ మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు
ముంబైలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో జనసైనికులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధ దశభుజ మహా గణపతి ఆలయానికి జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఈ ఆలయంలో నిండు టెంకాయ సమర్పిస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకంతో స్వామివారికి నిండు టెంకాయ సమర్పించి ప్రత్యేక అర్చనలు చేయించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి శక్తితో ప్రజాసేవ చేయాలని భగవంతుడిని ప్రార్థించినట్లు జనసేన నేతలు నారాయణస్వామి, కేశవ్, బండి యశశ్వి, సతీష్ కుమార్, అభిరామ్ తెలిపారు.