రాయదుర్గం: గార్మెంట్ ఇండస్ట్రీ, టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి : జిల్లా ఇంచార్జ్ మంత్రి టిజి భరత్
రాయదుర్గంలో గార్మెంట్ ఇండస్ట్రీల ఏర్పాటు, టెంపుల్ టూరిజం ఏర్పాటు కు కృషి చేస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి TG భరత్ హామీ ఇచ్చారు. గురువారం పట్టణంలో స్థానిక MLA కాలవశ్రీనివాసులు ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో జర్మనీ పర్యటనకు వెళుతున్నామని అక్కడ ప్రత్యేకంగా టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వెంకటశివుడు, టంకశాల హనుమంతు, శ్రీధర్ చౌదరి పాల్గొన్నారు.