మార్కాపురం: జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడడంతో యోగాంధ్ర కార్యక్రమానికి అంతరాయం
భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని కానీ దురదృష్టకరం వర్షం పడి అంతరాయం కలిగిందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో థీమాటిక్ యోగా కార్యక్రమం నిర్వహించేందుకు మూడు రోజులుగా అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో సభా ప్రాంగణం వర్షపు నీటితో తడిచిపోయింది అన్నారు