గిద్దలూరు: కంభం మండలం తురిమెళ్ళ గ్రామ సమీపంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు
మార్కాపురం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమయానికి కారులో ఉన్న బెలూన్లు తెచ్చుకోవడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తుంది. మితిమీరున వేగమే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.