దర్శి: దర్శి లో ఘనంగా ప్రారంభమైన వర్చువల్ మహానాడు కార్యక్రమం
Darsi, Prakasam | May 27, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మహానాడు సందడి మొదలైంది. నాలుగవ క్లస్టర్ పరిధిలో పిజిఎన్ కాంప్లెక్స్ లో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. టిడిపి నాయకులు కార్యకర్తలు, కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి నుండి వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద స్క్రీన్ లపై వీక్షించారు. స్థానిక టిడిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.