గిద్దలూరు: గిద్దలూరులో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రజా ప్రతినిధుల చేత ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి పాటుపడతామని ప్రజా ప్రతినిధుల చేత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భావితరాల పౌరులకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిర్మూలించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.