రాయదుర్గం: పట్టణంలోని కణేకల్లు రోడ్డు వీరాపురం ఫారెస్టు ఏరియాలో రోడ్డు వేడండి : ఆర్సీపీ రాయదుర్గం డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు
రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం ఫారెస్టు ఏరియాలో రోడ్డు వేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ RCP డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కణేకల్లు రోడ్డు వీరాపురం ఫారెస్టు ఏరియాలో రోడ్డు చిన్నదిగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయివని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.