కొండపి: సింగరాయకొండ మండలం పెద్దన్నపాలెంలో వడదెబ్బతో పశువుల కాపరి మృతి, ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
ప్రకాశం: సింగరాయకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పశువులను మేతకు తీసుకువెళ్లిన పశువుల కాపరి బుల్లయ్య (86) వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయాన్నే పశువులను తీసుకొని పొలానికి వెళ్లిన బుల్లయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ పొలానికి వెళ్లారు. అప్పటికే బుల్లయ్య మృతి చెంది ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వడదెబ్బతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.