కొండపి: సింగరాయకొండ పాకాల మరియు పరిసర ప్రాంతాలలోని సముద్రతీరంలో చేపల వేట నిషేధం నేటితో ముగింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో చేపల వేట నిషిద్ధం నేటితో ముగిసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అధికారులు చేపల వేటన నిషేధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చేపల సంతానం ఉత్పత్తి చేసే సమయం కాబట్టి అధికారులు చేపలు వేట నిషేధం విధించారు. రేపటి నుంచి జాలర్లు తమ చేపల వేటను కొనసాగిస్తారని అధికారులు తెలిపారు.