కొండపి: మర్రిపూడి ఎస్సై కొట్టాడంటూ ఆత్మహత్యకు యత్నించిన బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమనపు సురేష్
ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్ తనను కొట్టాడంటూ అవమానంగా భావించి కనిగిరికి చెందిన ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి కొండపి వైసిపి ఇన్చార్జ్ ఆదిములకు సురేష్ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించేందుకు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించి విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్తారని అంతేకాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని మాజీ మంత్రి అన్నారు.