యర్రగొండపాలెం: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన కలనూతల నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. 2006వ సంవత్సరంలో రెవెన్యూ అధికారులు వారి తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అన్నదమ్ముల ఫోటోలు కూడా తీశారన్నారు. కానీ గెజిట్ లో తన నాన్న పేరే ఉందని తమ పేర్లు లేవన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వారు కోరారు