దర్శి: దొనకొండ మండలంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో వసంతరావు నాయక్
Darsi, Prakasam | May 16, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వసంతరావు నాయక్ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాలు బాగుంటే గ్రామస్తులు బాగుంటారన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తిరస్కరించాలని భవిష్యత్తు తరాలను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.