రాయదుర్గం: కాంగ్రెస్ నేత గౌని ప్రతాపరెడ్డి ఆరోపణలు తిప్పికొట్టిన టిడిపి ఎస్సీ సెల్ నాయకులు వెంకటేశులు, మల్లికార్జున
కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆరోపణలపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన అవినీతి, దోపిడీపై దమ్ముంటే పిల్ వేయాలని టిడిపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి తాళ్ళకెర వెంకటేషులు, ఉపాధ్యక్షులు మల్లికార్జున, మాజీ సర్పంచ్ వన్నూరస్వామి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని రాయదుర్గంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.