మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఆర్టీసీ బస్టాండ్ జిల్లా వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని అన్నా క్యాంటీన్ ఆర్టీసీ బస్టాండ్ జిల్లా వైద్యశాలను విస్తృతంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనిఖీలు చేపట్టారు. అన్న క్యాంటీన్లో భోజనం రుచి చూసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్లు ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిపో మేనేజర్ కు సూచించారు. జిల్లా వైద్యశాలలో వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేయడానికి యంత్రాల కొరత ఉందని డాక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.