యర్రగొండపాలెం: మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని రైతులు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల మొక్కజొన్న రైతులు సురోహ సీడ్స్ కంపెనీ ప్రతినిధి నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించాలంటూ కలెక్టర్ విజయ సునీతను ఆశ్రయించారు. పెద్దారవీడు మండలంలోని 15 మంది రైతులను సురోహ సీడ్స్ యజమాని శేషిరెడ్డినీ నమ్మి మొక్కజొన్న పంట వేయించాడు. రైతులు పంట సాగు చేసిన అనంతరం వారి వద్ద నుంచి పంట కొనుగోలు చేసి తీసుకువెళ్లాడు. డబ్బులు ఇచ్చే సమయంలో రైతులను శేశిరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దాదాపు ఐదు నెలల నుంచి తమకు రావలసిన డబ్బులను రైతులు ఇవ్వాలని శేశిరెడ్డి నీ పలుమార్లు అడుగుతుండగా తప్పించుకొని తిరుగుతున్నాడని రైతులు వాపోతున్నారు.