రాయదుర్గం: చెత్త తరలింపు వాహనాలు ప్రెవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలంటూ పట్టణంలో ధర్నా
పురపాలక సంఘాలలో చెత్త తరలింపు వాహనాలు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని దీనివల్ల పారిశుద్ధ్య విభాగంలో పని చేసే కార్మికులను తొలగించే అవకాశం ఉందని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని పాత ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులు దర్నా నిర్వహించారు. కార్మికిలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని యూనియన్ నాయకులు రాము తదితరులు డిమాండ్ చేశారు.