గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రూ.68 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని ఇప్పటివరకు గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.28 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాధ్యంలో అభివృద్ధి సంక్షేమం రెండు ప్రజలకు అందుతున్నాయని ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని ఎ