మార్కాపురం: బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం పెద్దలకు సూచించిన సీఐ రాజేష్ కుమార్
మార్కాపురం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా సీఐ రాజేష్ ముస్లిం పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ... గోవధ జరగకుండా ప్రభుత్వ న్యాయస్థానాల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముస్లిం పెద్దలు తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. పండగ శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు