దర్శి: తాళ్లూరు ముండ్లమూరు మండల కేంద్రాలలో ఆకస్మికంగా లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐలు మల్లికార్జున, కమలాకర్
Darsi, Prakasam | Mar 31, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరులో ఎస్సై మల్లికార్జున తన సిబ్బందితో పలు లాడ్జిలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా బసవ చేస్తున్న వారి వివరాలు ఐడి ప్రూఫ్ లు రిజిస్టర్ నమోదు విధానం సీసీ కెమెరాల పనితీరు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అదేవిధంగా ముండ్లమూరు మండల కేంద్రంలో ఎస్సై కమలాకర్ పలు లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని యజమానులను హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లయితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలన్నారు.