యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలో సాగర్ వాటర్ పైపులైన్ల పనులను పునః ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో సాగర్ వాటర్ పైప్ లైన్ల పనులను టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిషన్ బాబు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూపాడు నుండి దోర్నాల వరకు సాగర్ వాటర్ పైపులైన్ల పనులను ప్రారంభించామన్నారు. పనుల పురోగతికి సంబంధించిన అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. పైపులైన్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన సాగర్ జలాలు అందేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. త్వరలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదగా ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు తెలిపారు.