మార్కాపురం: పొదిలిలో భార్యను ఇంట్లోకి రానికపోవడంతో ఇంటిముందు కూర్చుని ధర్నా, పోలీసులకు ఫిర్యాదు
మార్కాపురం జిల్లా పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి స్వరూపరాణి తో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతి తో సంబంధం పెట్టుకుని భార్యను వేధిస్తుండడంతో స్వరూపారాణి పుట్టింటికి వెళ్ళింది. భర్తలో మార్పు రాకపోతుందా అని భార్య ఇంటికి రాగా మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా నిర్వహించి పోలీసులను సంప్రదించారు