మార్కాపురం: తుమ్మల చెరువులో పట్టాభి రామస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో పట్టాభి రామస్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రాచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక సంతరించుకుంది. ధ్వజస్తంభ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.