యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వేగినాటి కోటయ్య నగర్ లో పీఎం ఆవాస యోజన ద్వారా నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇండ్లు మాలిక వసతులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.