మార్కాపురం: పొదిలి లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఐ రాజేష్ కుమార్
మార్కాపురం జిల్లా పొదిలి జాతీయ రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ సమస్య తీవ్రమౌతుంది. ఒంగోలు కర్నూలు రహదారిపై వందల సంఖ్యల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు ప్రత్యేకంగా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసి సంబంధిత ప్రాంతాల్లో ఉంచారు. ప్రజలు సహకరించాలన్నారు