దర్శి: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి వెల్లడి
Darsi, Prakasam | May 11, 2026 కూటమి ప్రభుత్వంలో రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులకు గురవుతున్నారని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి అన్నారు. దళారీ వ్యవస్థ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులతో ఆడుకుంటున్నారని విమర్శించారు. యుద్ధం కారణంగా ఎరువులు పెరిగితే కేంద్రం నుంచి సబ్సిడీ అడగాలి కానీ రైతుల మీద భారం మోపుతున్నారని మండిపడ్డారు.