రాయదుర్గం: 74 ఉడేగోళం గ్రామంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 'ఒక నియోజకవర్గం, ఒక నెల నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో బాగంగా ఈ గ్రామంలో రెండవ సందర్శన శుక్రవారం చేశారు. గత వారం జిల్లా కలెక్టర్, జెసి హాజరై వినతులు స్వీకరించగా నేడు వాటిపై జెసి సమీక్షించారు. వందశాతం పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ హరికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.