రాయదుర్గం: మహానాడు విజయవంతానికి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సన్నాహక సమావేశం
ఈ నెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ను విజయవంతం చేసేందుకు రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని రెండు క్లస్టర్ ల ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో నాయకులు కార్యకర్తలు మహానాడు లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, క్లస్టర్ ఇంచార్జ్ బడిగే ఇనాయత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, టంకశాల హనుమంతు, మాజీ కౌన్సిలర్ లు, వార్డు ఇన్చార్జ్ లు పాల్గొన్నారు.