మార్కాపురం: జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తూ దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అన్నారు. తర్లుపాడు, కంభం రోడ్డులలో ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య పునరావృత్తం అవుతుందని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.