గిద్దలూరు: రాచర్ల మండలం జెపి చెరువులోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవాలయంను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పీవీఎన్ మాధవ్‌కు ఆలయ చైర్మన్ నర్సింహులు అర్చకులు, స్థానిక నాయకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. దేవాలయ ఆధ్యాత్మిక వైభవం, ప్రకృతి సౌందర్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని పీవీఎన్ మాధవ్ తెలిపారు.