మార్కాపురం: నాయుడు పల్లి గ్రామంలో విలేజి హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేదని స్థానికులు వెల్లడి
మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో విలేజి హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం పూర్తయింది. కానీ గ్రామ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రారంభానికి నోచుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేందుకు విలేజి హెల్త్ క్లినిక్ భవనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ భవనాలు నిరుపయోగంగా మారాయి. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.