మార్కాపురం: గడియారం స్తంభం సెంటర్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది అన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందపరిచిన హామీలను ప్రజలు నమ్మరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతకం చేయించి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు.