మార్కాపురం: రామతీర్థం నుండి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డ
మార్కాపురం జిల్లా పొదిలి లోని ఒకటి రెండు బ్లాక్ లలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్థానికులు నీటి సమస్య ఉందని తమ దృష్టికి తీసుకొచ్చారు అన్నారు. వాస్తవంగా నీటి సమస్య ఉందని దర్శి సమ్మర్ స్టోరేజ్ వద్ద ఏకధాటిగా మూడు రోజులు పంపింగ్ చేస్తే అప్పుడు పొదిలికి పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వగలుగుతామన్నారు. రామతీర్థం జలాశయం నుండి పొదిలికి మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.