ఉరవకొండ: గుండ్లపల్లి సమీపంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీకొన్న ట్రాక్టర్
బెలుగుప్ప మండలం గుండ్లపల్లి సమీపంలో శుక్రవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రివర్స్ చేస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బళ్ళారి వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొనింది. బస్సు ముందర భాగం డ్యామేజ్ అయింది. అద్దాలు ద్వంసమయ్యాయి. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.