మార్కాపురం: అలుగు కు రెండువైపుల వ్యర్ధాలను తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కేంద్రంలో చెరువు అలుగుకు రెండువైపులా వ్యర్ధాలతో నిండి ఉంది. మరోవైపు అలుగుకు ముందు వైపు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో అందులో వ్యర్ధాలను వేస్తున్నారు. రాబోయే వర్షాకాలం నాటికి అలుగు సమీపంలో వ్యర్ధాలను తొలగించాలని స్థానికులు కోరారు. కూలిపోయిన ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు